America : అమెరికా టారిఫ్‌లపై చైనా ప్రతీకారం

అందరూ భయపడుతున్నట్లే వాణిజ్య యుద్ధం తీవ్రమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విధించిన సుంకాలపై చైనా (China) ప్రతీకార చర్యలకు దిగింది. అమెరికా టెక్ సంస్థ గూగుల్ (Google)పై విచారణకు ఆదేశించడమే కాకుండా ఆ దేశ వస్తువులపై కొత్త సుంకాలు విధించింది. అమెరికా నుంచి దిగుమతి అవుతున్న బొగ్గు, ద్రవీకృత సహజ వాయువుపై (ఎల్‌ఎన్‌జీ) 15 శాతం సుంకం విధిస్తున్నట్లు చైనా ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రకటించింది. ముడి చమురు, వ్యవసాయ పరికరాలు, పెద్ద ఇంజిన్ల కార్లపై 10 శాతం సుంకాన్ని వసూలు చేయనున్నట్లు తెలిపింది. అలాగే యాంటీ ట్రస్టు చట్టాలను ఉల్లంఘించిన ఆరోపణలతో గూగుల్‌పై విచారణకు ఆదేశించినట్లు డ్రాగన్ పేర్కొంది. వచ్చే సోమవారం నుంచి టారిఫ్ (Tariff)లు అమల్లోకి వస్తాయని చైనా వెల్లడిరచింది.