Reliance : రిలయన్స్ మరో ఘనత

భారత అతిపెద్ద, అత్యంత విలువైన కంపెనీగా పేరొందిన రిలయన్స్(Reliance) ఇండస్ట్రీస్ తాజాగా మరో ఘనత సాధించింది. 2024 ఏడాదికి గానూ ఫ్యూచర్ బ్రాండ్ (Future Brand) విడుదల చేసిన అంతర్జాతీయ అత్యుత్తమ బ్రాండ్‌ల జాబితాలో ఏకంగా రెండో స్థానంలో నిలిచింది. యాపిల్(Apple), నైక్ (Nike) వంటి దిగ్గజ సంస్థలను వెనక్కి నెట్టి రిలయన్స్ టాప్ 2 బ్రాండ్‌గా అవతరించింది. మార్కెట్ మార్పులను ముందే ఊహించి వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడం, బ్రాండ్ ప్రయోజనాలను ఉత్తమంగా నెరవేర్చడం, కంపెనీ అనుభవాలు తదితర అంశాల అధారంగా ఫ్యూచర్‌బ్రాండ్ ఈ జాబితాను రూపొందించింది. ఇందులో దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ (Samsung )అగ్ర స్థానంలో నిలవగా, రిలయన్స్ రెండో స్థానం దక్కించుకుంది. గత జాబితాలో ఐదో స్థానంలో ఉన్న శాంసంగ్ ఈ సారి టాప్ 1లో నిలిచింది.