Microsoft : మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు మరోసారి షాక్!

అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) తన ఉద్యోగులకు మరోసారి షాక్ ఇచ్చింది. ఉద్యోగులు (Employees) పనితీరును మెరుగుపరచుకోవడం లేదని తొలగింపులకు ఉపక్రమించింది. దీంతో కొందరు ఉద్యోగులు తక్షణమే తమ కొలువులను కోల్పోతున్నట్లు తెలిసింది. ఉద్యోగులు తమ స్థాయికి తగిన కనీస పనితీరు ప్రమాణాలను అందుకోలేని కారణంగా ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు వారికి పంపిన లేఖల్లో పేర్కొంది. తక్షణమే అన్ని విధుల నుంచి రిలీవ్ చేస్తున్నామని, మైక్రోసాఫ్ట్ సిస్టమ్స్ (Microsoft Systems), అకౌంట్స్, బిల్డింగ్‌లలోకి యాక్సెస్ (Access)ను తొలగించినట్టు తెలిపింది. అయితే ఎంత మందిపై వేటు పడిరదనేది తెలియరాలేదు. కాగా కంపెనీ ఇటీవల సెక్యూరిటీ, ఎక్స్‌పీరియన్సెస్, డివైజెస్ (Devices), సేల్స్, గేమింగ్ వంటి విభాగాల్లో ఉద్యోగులను తొలగించింది.