Meta : మెటాలో 3000 మంది ఉద్యోగుల తొలగింపు!

వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా సంస్థల మాతృసంస్థ మెటా (Meta) దాదాపు 3000 మంది ఉద్యోగులను తాజాగా తొలగిస్తోంది. కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో ఇది దాదాపు 5 శాతానికి సమానం. తొలగింపునకు గురయిన ఉద్యోగులకు ఇప్పటికే సమాచారాన్ని సంస్థ అంతర్గతంగా పంపినట్లు తెలుస్తోంది. నేడు ఇ-మెయిల్ (Email) ద్వారా సమాచారం ఆయా ఉద్యోగులకు వెళ్తుందని మెటా ఉపాధ్యక్షుడు ( హెచ్‌ఆర్) జానెల్లె గాలె(Janelle Gale) తెలిపారు. పనితీరు సక్రమంగా లేని ఉద్యోగులను సాధ్యమైనంత త్వరగా తొలగిస్తామని ఇటీవల మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్(Zuckerberg) ప్రకటించిన విషయం తెలిసిందే. ఉద్యోగుల పనితీరు సమీక్షల ఆధారంగా తాజా తొలగింపులను కంపెనీ చేపట్టింది.