Meta :ఉద్యోగులపై వేటువేసి మేటా

మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని టెక్ సంస్థ మెటా(Meta) కొందరు ఉద్యోగుల(Employees) పై వేటు వేసింది. ముఖ్యమైన సమాచారాన్ని మీడియా(Media) కు పంపించారనే కారణంతో కొంతమందిని సంస్థ నుంచి తొలగించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నుంచి ఓవైపు ఒత్తిడి ఎదుర్కొంటున్న సంస్థ ఇలా ఉద్యోగులను తొలగించడం చర్చనీయాంశమైంది. మెటా తాజాగా నిర్వహించిన దర్యాప్తులో కంపెనీకి సంబంధించిన సమాచారాన్ని కొందరు బహిర్గతం చేసినట్లు తేలిందని సంస్థ తెలిపింది. ఈ కారణంతో దాదాపు 20 మందిని తొలగించిందని స్పష్టం చేసింది. ఇలా డేటా లీక్ (Data leak) చేసినవారిలో మరికొంతమంది ఉండే అవకాశం ఉందని పేర్కొంది. కంపెనీ పాలనీకి వ్యతిరేకంగా ప్రవర్తించినందుకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడిరచింది. ఇకపై లీక్‌లు జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.