Instagram : టిక్‌టాక్‌కు పోటీగా ఇన్‌స్టా

టిక్‌టాక్ స్ఫూర్తితో ఇన్‌స్టాగ్రామ్ (Instagram)లో రీల్స్‌ను తీసుకొచ్చిన మెటా (Meta) సంస్థ ఇప్పుడు ఆ సంస్థకు పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇన్‌స్టా రీల్స్ (Insta Reels) కోసమే ప్రత్యేకంగా యాప్‌ను తీసుకురావాలని చూస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మొస్సేరి (Adam Mosseri) ఇప్పటికే ఈ విషయాన్ని తమ సిబ్బందికి తెలిపినట్లు సమాచారం. అంతేకాదు, రీల్స్ 3 నిమిషాల వీడియోలు కూడా చూపించనున్నట్లు తెలుస్తోంది. ఇది కూడా టిక్‌టాక్ (TikTok) తరహాలోనే వర్టికల్‌గా స్క్రోల్ కానుంది.