Infosys :ఉద్యోగులకు ఇన్ఫోసిస్ తీపి కబురు … త్వరలో

ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) ఉద్యోగులకు త్వరలో తీపి కబురు చెప్పనుంది. అర్హులైన ఉద్యోగులకు వేతనాల పెంపును ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. దీనికి సంబంధించి ఈ నెల ముగిసేలోగా ఉద్యోగుల (Employees)కు వేతన పెంపునకు సంబంధించిన లేఖలు జారీ చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ వేతన పెంపు 5-8 శాతం మద్య ఉండొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ (April) నుంచి పెరిగిన వేతనాలు అమల్లోకి రానున్నాయి. ఇటీవలే వెల్లడిరచిన మూడో త్రైమాసిక ఫలితాల సందర్భంగానూ 6-8 శాతం వేతన పెంపు ఉండొచ్చని కంపెనీ సీఎఫ్‌ఓ జయేశ్ సంఫ్‌ురాజ్‌కా (Jayesh Samphrajka) వెల్లడిరచారు. ఇన్ఫోసిస్ బ్యాచ్‌ల వారీగా ప్రమోషన్ లెటర్లు జారీ చేయడం ప్రారంభించింది. డిసెంబర్‌లో మొదటి బ్యాచ్ ఉద్యోగులకు ఈ లేఖలు అందాయి. ఫిబ్రవరి నెలాఖరులో మరికొందరికి ప్రమోషన్లు అందించనుంది. గతంలో లెటర్లు అందుకున్న వారికి జనవరి నుంచి వేతన పెంపు అమల్లోకి వచ్చింది.