Infosys :ఇన్ఫోసిస్ శుభవార్త.. ఉద్యోగులకు

ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ (Infosys) అర్హులైన ఉద్యోగులకు వేతనాల పెంపును ప్రకటించింది. ఈ మేరకు సంబంధించిన లేఖలు (Letters) ఉద్యోగులకు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఉద్యోగుల (Employees)కు సగటున 5 నుంచి 8 శాతం వరకు జీతాన్ని పెంచినట్లు సమాచారం. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు 20 శాతం వేతనాలు పెంచినట్లు తెలుస్తోంది. ఇన్ఫోసిస్ తన సంస్థలో విధులు నిర్వర్తించే ఉద్యోగులను మూడు విభాగాలు(Three sections )గా వర్గీకరించింది. అందులో కంపెనీల అంచనాలు అందుకున్న వారికి 5-7 శాతం జీతాన్ని పెంచింది. ప్రశంసించదగ్గ పనితీరు కనబరిచిన వాళ్లకు 7-10 శాతం, అత్యుత్తమ ప్రదర్శన చూపినవారికి 10-20 శాతం వరకు ఇంక్రిమెంట్లు అందించినట్లు తెలుస్తోంది. అయితే 20 శాతం వేతన పెంపు అందుకున్న వారి సంఖ్య తక్కువ అని సమచారం. అలాగే, అతి తక్కువ పనితీరు కనబర్చిన ఉద్యోగులకు జీతాన్ని పెంచలేదు. జనవరి (January) 1 నుంచి ఈ వేతన పెంపు వర్తిస్తుందని తెలుస్తోంది.