దుబాయ్‌కి ఇండిగో విమాన సేవలు షురూ
యుఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)కు ఇండిగో విమాన సేవలను నిషేధించిన వారం రోజుల తర్వాత ఇప్పుడు మళ్లీ ప్రారంభించారు. ఇండిగో విమానాలు దుబాయ్‌కి సేవలను ప్రారంభించినట్టు కంపెనీ తెలిపింది. ఆగస్టు 20 రాత్రి నుంచి భారత్, యుఎఈ మధ్య ఇండిగో సేవలు ప్రారంభించిదని సంస్థ తెలిపింది. ఆర్టీ-పీసీఆర్ రిపోర్ట్ లేని ప్రయాణికుడిని దుబాయ్ తీసుకెళ్లారనే కారణంతో ఇండిగో సర్వీసులపై దుబాయ్ అధికారులు ఆంక్షలు విధించారు. నిషేధం తర్వాత సర్వీసులు పున ప్రారంభిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ఏదైనా అంతరాయం కలిగి వుంటే చింతిస్తున్నామని ప్రకటనలో ఇండిగో పేర్కొంది. భారత్ నుంచి అన్ని కేటగిరీల ప్రయాణికులను దుబాయ్ అనుమతించడం లేదు. కాగా భారత్ లో సెకండ్ వేవ్ విలయం సృష్టిస్తున్న నేపథ్యంలో ఏప్రిల్ 24 నుంచి భారత్ నుంచి విమానాలను యూఏఈ రద్దు చేసిన విషయం తెలిసిందే.






