India: ఇండియా, యూకే ఎఫ్‌టీఏ చర్చలు పున ప్రారంభం

ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై (ఎఫ్‌టీఏ) చర్చలు పున ప్రారంభమైనట్టు భారత్(India), యూకే (UK) ప్రకటించాయి. ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ప్రస్తుతం ఉన్న 2,000 కోట్ల డాలర్ల నుంచి రెండిరతలు లేదా మూడిరతలు చేయాలన్న లక్ష్యసాధనకు ఇది దోహదపడుతుందని భావిస్తున్నారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్, ప్రస్తుతం మనదేశంలో పర్యటిస్తున్న బ్రిటిష్ వ్యాపార, వాణిజ్య శాఖ మంత్రి జోనాథన్ రేనాల్డ్స్ ఈ విషయం ప్రకటించారు.