ఎంఐటీతో హీరో విర్డ్ భాగస్వామ్యం
అత్యంత ప్రతిష్టాత్మకమైన అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) యొక్క పలు పోగ్రామ్లు, ఇతర కార్యక్రమాలతో తాము భాగస్వామ్యం చేసుకున్నామని హీరో విర్డ్ ప్రకటించింది. హీరో వర్డ్ ఫౌండర్, సీఈవో అక్షయ్ ముంజాల్ మాట్లాడుతూ హీరో విర్డ్ వద్ద మేము విద్యను పునరావిష్కరిస్తున్నాం. ప్రపంచ ప్రసిద్ధి చెందిన మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో కలిసి పనిచేయడం ద్వారా అభివృద్ధి చెందుతున్న భావి సాంకేతికతలతో బహళ కార్యక్రమాలను అందించనుండటం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నామన్నారు. ఎంఐటిఎక్స్, ఎంఐటీ ఎక్స్ మైక్రోమాస్టర్స్, పోగ్రామ్లను ఎఐ, ఎంఎల్, డాటా సైన్స్, ఫైనాన్స్, ఫైనాన్షియల్ టెక్నాలజీస్, గేమ్ డిజైన్ కార్యక్రమాలలో మిళితం చేయడం ద్వారా నైపుణ్యాభివృద్ధి అనుభవాలను అందించనున్నట్టు తెలిపింది.






