Google : గూగుల్‌లో ఉద్యోగాల కోత!

ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్ (Google) తాజాగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ చేపట్టింది. క్లౌడ్ డివిజన్ (Cloud Division)లోని ఉద్యోగుల (Employees) సంఖ్యను తగ్గించిందని సమాచారం. సంబంధిత వ్యక్తులు ఈ విషయాన్ని వెల్లడిరచారు. అయితే ఎంతమందిని తొలగించిందనే విషయం మాత్రం తెలియరాలేదు. వంద మందికి పైగా ఉండొచ్చని, అది కూడా కొన్ని టీమ్స్‌పై మాత్రమే తొలగింపుల ప్రభావం ఉందని తెలుస్తోంది. కంపెనీ దీర్ఘకాలిక విజయాల కోసం వ్యాపారానికి కీలకమైన రంగాల్లో పెట్టుబడులు పెంచేందుకు సంస్థ ప్రయత్నిస్తోంది. అందులోభాగంగా కొన్ని మార్పులు చేస్తున్నాం అని గూగుల్ అధికార ప్రతినిధి (Google spokesperson) ఒకరు తెలిపారు. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా రానున్న రోజుల్లో అవకాశాల్ని అందిపుచ్చుకొనేందుకు అనేక సర్దుబాట్లు చేశామని వెల్లడిరచారు.