America: అమెరికా టారిఫ్ విధింపును తప్పుబట్టిన ఈయూ

అమెరికాలో దిగుమతి అయ్యే ఉక్కు(Steel), అల్యూమినియం (Aluminum) దిగుమతులపై 25 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించిన మరుసటి రోజే 27 దేశాల యూరప్ (Europe) కూటమి ఘాటుగా స్పందించింది. అర్ధ రహిత టారిఫ్‌లతో దుందుడుకుగా వ్యవహరిస్తు న్న అమెరికా ప్రభుత్వానికి తగు సమాధానం చెప్తామని యూరోపియన్ యూనియన్ అధ్యక్షురాలు ఉర్సులావాన్ డీర్ లియాన్ ప్రకటించారు. ట్రంప్ టారిఫ్ సవాలుకు దీటుగా బదులిస్తాం. అవి చెడ్డ పన్నులు. వ్యాపారస్తులకూ చెడ్డవే. వినియోగదారులకు గుదిబండలు. యూరోపియన్ యూనియన్‌కు భారంగా మారిన ఈ టారిఫ్‌లకు దీటైన సమాధానం చెప్తాం అని ఉర్సులా పేర్కొన్నారు.