ప్రపంచ కుబేరుల్లో రాధాకిషన్ దమానీ
ప్రపంచంలోని 100 మంది కుబేరుల్లో డి మార్ట్ అధినేత రాదాకిషన్ దమానీకి చోటు దక్కింది. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ సూచీలో ఆయనకు 98వ స్థానం లభించింది. దమానీ నికర సంపద 19.2 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1,38,00 కోట్లు)గా నిర్ధారించారు. ప్రముఖ మదుపరి అయిన రాధాకృష్ణ దమానీ అవెన్యూ సూపర్మార్టస్ సంస్థకు వ్యవస్థాపకుడు. ఈ సంస్థే డి మార్ట్ విక్రయ కేంద్రాలను నిర్వహిస్తోంది. 100 మంది అగశ్రేణి కుబేరుల్లో మన దేశం నుంచి ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, అజీమ్ ప్రేమ్జీ, పల్లోంజీ మిస్త్రీ, శివ్ నాడార్, లక్ష్మీ మిత్తల్ ఉన్నారు.






