RBI :వారికి ఆర్‌బీఐ గుడ్‌న్యూస్

గృహ రుణ వినియోగదారులకు ఎట్టకేలకు రిజర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఆర్‌బీఐ) గుడ్‌న్యూస్ చెప్పింది. రెపో రేట్‌ను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టకుంటూనే వృద్ధికి ఊతం ఇవ్వాలన్న ఉద్దేశంతో 25 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును తగ్గిస్తున్నట్లు ఆర్‌బీఐ(RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా(Sanjay Malhotra) తెలిపారు. దీనికి మానిటరీ పాలసీ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని చెప్పారు. ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో రెపో రేటు 6.50 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గింది. ఐదేళ్ల నుంచి వడ్డీ రేట్లు పెరగడం తప్ప, తగ్గడం చూడని హోమ్‌లోన్ (Home Loan) కస్టమర్లకు ఇది ఊరట కల్పించే అంశమనే చెప్పాలి. ఆ మేరకు ఈఎంఐ (EMI) తగ్గనుంది.