Apple అమెరికాలో యాపిల్ 20,000 నియామకాలు

వచ్చే నాలుగేళ్లలో అమెరికాలోనే 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు యాపిల్ (Apple) వెల్లడిరచింది. దీంతోపాటు అమెరికాలో 20,000 మంది కొత్త ఉద్యోగులను నియమించుకుంటామని, ఏఐ ( కృత్రిమ మేధ) సర్వర్‌లను ఏర్పాటు చేస్తామని టెక్ దిగ్గజం యాపిల్ ప్రకటించింది. చైనా (China) నుంచి వచ్చే దిగుమతులపై టారిఫ్ విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రకటించడంతో, ఆయనను శాంతపరిచేందుకు యాపిల్ ఈ నిర్ణయం తీసుకుంది. తన ఐఫోన్ల (iPhones)లో అత్యధికం చైనాలోనే యాపిల్ తయారు చేయిస్తోంది.
అమెరికా అధ్యక్షుడి హెచ్చరికలు అమల్లోకి వస్తే, వీటిపైనా 10 శాతం అదనపు పన్ను పడొచ్చు. హ్యూస్టన్ (Houston)లో కొత్త సర్వర్ తయారీ కేంద్రం, మిషిగాన్‌లో సప్లయిర్ అకాడమీలను ఏర్పాటు చేయనుంది. ఆరిజోనా, ఒరెగాన్, లోవా, నెవాడా, నార్త్ కరోలినా రాష్ట్రాల్లోని డేటా కేంద్రాలనూ విస్తరిస్తామని తెలిపింది.