Air India : ఎయిరిండియా నమస్తే వరల్డ్ ఆఫర్

ఎయిరిండియా నమస్తే వరల్డ్ (Namaste World)పేరిట ఆకర్షణీయమైన ఆఫర్‌ను ప్రకటించింది. అన్ని రకాల క్లాస్‌లకు ఇది వర్తిస్తుంది. ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు ఈ సేల్ నిర్వహిస్తున్నారు. ఈ టికెట్లపై కస్టమర్లు ఫిబ్రవరి (February) 12వ తేదీ నుంచి అక్టోబరు (October) 31వ తేదీ మధ్యలో తమకు అనుకూలమైన ఏ తేదీల్లో అయినా ప్రయాణించవచ్చు. విదేశీ గమ్యాలను ఎంచుకునే వారు విదేశీ కరెన్సీలో కూడా చెల్లింపులు చేయవచ్చు. దేశీయంగా ఎకానమీ క్లాస్ (Economy Class) ధర రూ1,499, ప్రీమియం ఎకానమీ ధర రూ.3,749, బిజినెస్ క్లాస్ ధర రూ.9,999గా నిర్ణయించారు. అలాగే అంతర్జాతీయ గమ్యాలకు ఎకానమీ క్లాస్ రూ.12,577, ప్రీమియం ఎకానమీ క్లాస్ రూ.16,213, బిజినెస్ క్లాస్ ధర రూ.20,870గా ప్రకటించింది.