డొనాల్డ్ ట్రంప్ కు మరో షాక్…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఆ దేశ అత్యుత్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని జో బైడెన్ ఎన్నికను రద్దు చేయాలంటూ రిపబ్లికన్లు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. గత వారం పెన్సిల్వేనియా కోర్టు రిపబ్లికన్ల అభ్యర్థనను తిరస్కరించగా, తాజాగా ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానం సైతం అదే తీర్పును పునరుద్ఘాటించింది. సుప్రీంకోర్టు తిరస్కరించిన వ్యాజ్యానికి ఇద్దరు అగ్రనేతలు సహా సగానికిపైగా హౌజ్ రిపబ్లికన్లు మద్దతుగా నిలిచారు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, నాలుగు ప్రధాన రాష్ట్రాల్లో ఎలక్టోరల్ ఓట్లను రద్దు చేయాలని సుప్రీంకోర్టును టెక్సాస్ అటార్నీ జనరల్ ఆశ్రయించగా వారికి 17 మంది రిపబ్లికన్ అటార్నీ జనరల్స్, కాంగ్రెస్‌లోని 126 మంది సభ్యులు మద్దతు తెలిపారు. అయితే, ఈ పిటిషన్లపై డెమొక్రటిక్ నేతలతో పాటు పలువురు రిపబ్లికన్లు సైతం ఆందోళన వ్యక్తం చేయటం గమనార్హం.






