తైవాన్ అధ్యక్షురాలుతో అమెరికా ప్రజాప్రతినిధులు భేటీ
అమెరికా ప్రజా ప్రతినిధులు తైవాన్ అధ్యక్షురాలు సాయ్ సింగ్ వెన్‌తో భేటీ అయ్యారు. తైవాన్ను దురాక్రమణ చేయాలని చైనా రంకెలు వేస్తున్న నేపథ్యంలో అమెరికా ప్రజాప్రతినిధులు ఆకస్మికంగా ఆదేశానికి వెళ్లారు. తైవాన్ స్వయం పాలనకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కొన్ని దశాబ్దాలుగా ఎన్నడూ లేని విధంగా తైవాన్, చైనా మధ్య ఘర్షణలు తారాస్థాయికి వెళ్లాయి. తైవాన్ స్వాతంత్య్ర ఉద్యమానికి మద్దతు ఇస్తే చూస్తూ ఊరుకోబోమని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఇటీవల హెచ్చరించడం తెల్సిందే.






