కాట్సా నుంచి భారత్ కు మినహాయింపులు ఇవ్వలేం : అమెరికా
అమెరికా తన విధానాలకు వ్యతిరేకంగా ఉండే దేశాలతో మిత్ర దేశాలు ఎలాంటి లావాదేవీలు జరుపరాదంటూ ఓ చట్టం తీసుకువచ్చింది. దాని పేరు కాట్సా. కాట్సా అంటే కౌంటరింగ్ అమెరికాస్ యాడ్వెర్సరీస్ త్రూ శాంక్షన్స్ అని అర్థం. తన మాట వినకుండా తన శత్రుదేశాలతో సంబంధాలు కొనసాగించే దేశాలపై అమెరికా ఈ కాట్సా చట్టం పేరుతో ఆంక్షలు విధిస్తుంది. ఇప్పుడు భారత్ అగ్రరాజ్యం అమెరికాకు మిత్రదేశమే అయినా కాట్సాను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిరది. రష్యా నుంచి భారత్ 2019లో ఎస్ 400 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను కొనుగోలు చేసింది. దాంతో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అమెరికా కొత్త ప్రభుత్వం స్పందిస్తూ భారత్‌కు కాట్సా నుంచి మినహాయింపు ఇవ్వలమేని స్పష్టం చేసింది. పూర్తిగా, పాక్షికంగా ఎవరికీ మినహాయింపు కల్పించే వెసులుబాటు కాట్సా చట్టంలో లేదని అమెరికా వర్గాలు వెల్లడించాయి. ఇది భారత్‌కు వర్తిస్తుందని తెలిపింది.






