నిప్పుతో ఆటలాడొద్దు.. భస్మమైపోతారు
తైవాన్ విషయంలో జోక్యం చేసుకుంటే నిప్పుతో చెలగాటమాడినట్టేనని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హెచ్చరించారు. మాడి మసి కాక తప్పదని ఆయన అన్నారు. అమెరికా అధ్యక్షుడ జో బైడెన్‌కు తనకూ మధ్య జరిగిన వర్చువల్ భేటీలో ఈ హెచ్చరిక చేశారు. మ దేశ సార్వభౌమత్వం, రక్షణ తమకు కచ్చితంగా ప్రాధాన్యాంశాలేనని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల తైవాన్ విషయంలో అమెరికా జోక్యానికి సంబంధించిన కథనాల నేపథ్యంలో జిన్‌పింగ్ హెచ్చరించారు. ఇరువురు అగ్రనేతల మధ్య మూడు గంటలకు పైగా అంశాలపై ఈ భేటీ జరిగింది. చైనా ఎదుగుదల చారిత్రకంగా అనివార్యమైందని, దానిని ఎవరు ఆపలేరని జిన్‌పింగ్ ధీమా వ్యక్తం చేశారు. నిప్పుతో చెలగాటమాడితే కాలిపోక తప్పదంటూ జిన్‌పింగ్ హెచ్చరించారు.
తైవాన్ చైనాలో అంతర్భాగమని స్పష్టం చేశారు. తైవాన్ స్వాతంత్య్రం పేరుతో వేర్పాటు శక్తులు రెచ్చగొడ్తూ ఎర్రగీత దాటితే తగిన చర్యలు తప్పవని జిన్‌పింగ్ హెచ్చరించారు. జిన్‌పింగ్, బైడెన్ ఈ ఏడాది మధ్య ఫిబ్రవరి నుంచి ఇది మూడో భేటీ. సెప్టెంబర్‌లోనూ ఇరువురి మధ్యా ఫోన్లో సుదీర్ఘ సంభాషణ జరిగింది.






