ముంబై ఇండియన్స్‌కు హార్దిక్ పాండ్యా గుడ్ బై..? ఇన్‌స్టాలో ‘అన్‌ఫాలో’ రచ్చ..!
ఐపీఎల్ 2026(IPL 2026) సీజన్ నుండి ముంబై ఇండియన్స్ (MI) ప్లేఆఫ్స్ రేసులో ఓడిపోయి నిష్క్రమించిన తరుణంలో, ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హార్దిక్ పాండ్యా ఇన్‌స్టాగ్రామ్‌లో ముంబై ఇండియన్స్ అధికారిక ఖాతాను అన్‌ఫాలో చేశారనే వార్త సోషల్ మీడియాలో కార్చిచ్చులా వ్యాపించింది. కొద్దిసేపటికే మళ్ళీ ఫాలోయింగ్ లిస్టులోకి ఎంఐ ఎకౌంటు చేరినప్పటికీ, అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది.
ముంబై ఇండియన్స్ నాకౌట్ అయిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. రెండేళ్ళ క్రితం రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టినప్పటి నుండి జట్టులో అంతర్గత విభేదాలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా జరిగిన ఈ ‘అన్‌ఫాలో’ ఎపిసోడ్ ఆ అనుమానాలను మరింత బలపరిచింది. హార్దిక్ పాండ్యా ముంబై జట్టును వీడబోతున్నాడా..? లేదా యాజమాన్యంతో విభేదాలు తారస్థాయికి చేరాయా..? అనే సందేహాలు అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి.
ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో పేలవ ప్రదర్శన కనబరచడం, మైదానంలో ప్రేక్షకుల నుండి హార్దిక్ ప్రతికూలతను ఎదుర్కోవడం ఆయనను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాయని విశ్లేషకులు భావిస్తున్నారు. టెక్నికల్ సమస్య వల్ల ఇలా జరిగిందా లేక హార్దిక్ కావాలనే అన్‌ఫాలో చేశారా అన్నది పక్కన పెడితే, వచ్చే సీజన్ నాటికి ముంబై జట్టులో భారీ మార్పులు ఉంటాయనే సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి హార్దిక్ పాండ్యా వైపు నుండి కానీ, ముంబై ఇండియన్స్ యాజమాన్యం నుండి కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ స్క్రీన్ షాట్లు మాత్రం ముంబై ఫ్యాన్స్‌లో కొత్త చర్చకు దారితీశాయి.
ఇవి కూడా చదవండి
