హైదరాబాద్ లో టర్టైల్ వ్యాక్స్
అమెరికాలోని చికాగో కేంద్రంగా కార్ల సంరక్షణ సేవలు అందిస్తున్న సంస్థ టర్టైల్ వ్యాక్స్ ఇంక్, హైదరాబాద్లో 3 కో`బ్రాండెడ్ కార్ కేర్ స్టూడియోలను ప్రారంభించింది. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ మెయిన్ రోడ్లో, జెనెక్స్ నెంటర్, కేపీహెచ్బీ కాలనీ 5వ ఫేస్ వద్ద ఎక్ష్ప్లోడర్ కేంద్రం, బంజారాహిల్స్ 3వ రోడ్లో ఇండియన్ డెకార్స్ స్టూడియోలను టర్టైల్ వ్యాక్స్ ముఖ్య కార్యకలాపాల అధికారి లారీ కింగ్ ప్రారంభించారు. ఈ కేంద్రాల్లో కార్ల సంరక్షణకు అత్యుత్తమ సేవలు అందిస్తామని టర్లైల్ వ్యాక్స్ పేర్కొంది. సిరామిక్ కోట్ ప్రొటెక్షన్, హైబ్రిడ్ సిరామిక్ కోటింగ్, ఎక్స్టీరియర్ రిస్టొరేషన్ ట్రీట్మెంట్, ఇంటీరియల్ డిటెయిలింగ్, స్పెషాలిటీ ట్రీట్మెంట్, వాష్`45 వంటి సేవలు అందిస్తామని వివరించింది.






