IAS: తెలంగాణలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐఏఎస్ (IAS) , ఐపీఎస్(IPS) అధికారుల బదిలీలు చేసింది. ఈ నేపథ్యం లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా వీసీ సజ్జనార్ (VC Sajjanar) నియమితులయ్యారు. ఆయనను సిటీ కమిషనర్‌గా నియమిస్తూ, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీవీ ఆనంద్(CV Anand) నియమాకం అయ్యారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా శిఖా గోయల్ బాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్ర ఇంటెలిజెనర్స్ చీఫ్‌గా విజయ్‌కుమార్‌ను నియమిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రఘునందన్‌రావుకు ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్, సురేంద్ర మోహన్‌కు వ్యవసాయశాఖలను అప్పగించింది. గ్రేహౌండ్స్ ఏడీజీగా అనిల్ కుమార్, పౌరసరఫరాల కమిషనర్‌గా స్టీఫెన్ రవీంద్ర, ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డి, ఫైర్ డీజీగా విక్రమ్‌సింగ్, హైదరాబాద్ క్రైమ్స్ ఏసీపీగా శ్రీనివాసులు, హైదరాబాద్ అడిషనల్ శాంతిభద్రతల సీపీగా తసఫీర్ ఇక్బాల్, వెస్ట్‌జోన్ డీసీపీగా అనురాధ, సిద్దిపేట సీపీగా విజయ్‌కుమార్, నారాయణపేట ఎస్పీగా వినీత్, రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా హరిత, స్పెషల్ సెక్రటరీగా సందీప్‌కుమార్ ఝాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.