DGP : తెలంగాణ నూతన డీజీపీగా శివధర్‌రెడ్డి

తెలంగాణ నూతన డీజీపీ (DGP ) గా శివధర్‌రెడ్డి ( Shivdhar Reddy) నియమితులయ్యారు. 1994 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన శివధర్ రెడ్డి, ప్రస్తుతం ఇంటెలిజెన్స్ ఛీఫ్ (Intelligence Chief) గా ఉన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేతుల మీదుగా ఆయన ఆపాయింట్‌మెంట్ ఆర్డర్ అందుకున్నారు. అక్టోబర్ 1వ తేదీన తెలంగాణ డీజీపీగా శివధర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. శివధర్ రెడ్డి స్వస్థలం రంగారెడ్డి జిల్లా (Rangareddy District) ఇబ్రహీంపట్నం మండలం తూలేకలాన్ (పెద్దతుండ్ల) గ్రామం.తనను డీజీపీగా నియమించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు శివధర్‌రెడ్డి, దీనిలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు శివధర్‌రెడ్డి.