సింధు ఆసుపత్రిని ప్రారంభించిన ప్రధాని మోదీ
హైదరాబాద్ హైటెక్ సిటీలోని సింధు ఆసుపత్రి (Sindhu Hospital)ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని రాజ్యసభ సభ్యులు, హెటిరో గ్రూప్, సింధు ఆసుపత్రి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ బండి పార్థసారథిరెడ్డి (Dr. Bandi Parthasarathi Reddy), ఆయన సతీమణి కళావతి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. పార్థసారథి రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు సింధు ఆసుపత్రి సలహాదారు డా. నోరి దత్తాత్రేయుడు (Dr. Nori Dattatreyudu), ఇతర వైద్య ప్రముఖులు, పుష్పగుచ్ఛం అందజేసి ప్రధానిని ఆహ్వానించారు. పార్థసారథిరెడ్డి తండ్రి శ్రీనివాస్ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు వైద్యులు సిబ్బందిని మోదీ పలకరించారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న ఆధునిక సౌకర్యాలపై ప్రధాని ఆరా తీశారు. ఆసుపత్రి స్థాపన ఉద్దేశం? ఛార్జీలు ఎలా ఉంటాయి? రోగులతోపాటు వచ్చే సహాయకులు ఎక్కడ ఉంటారు? క్యాన్సర్ చికిత్సకు ఎలాంటి ఆధునిక పద్ధతులు అనుసరిస్తున్నారు. తదితర అంశాలపై ఆరా తీశారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
