ప్రపంచ రికార్డును నెలకొల్పిన ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్
హైదరాబాద్‌లోని ప్రముఖ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ మరోసారి చరిత్రను సృష్టించింది. 2016 ఏప్రిల్ -2017 మార్చి మధ్యకాలంలో ఏకంగా 2043 కార్నియల్ ట్రాన్స్‌ప్లాంట్స్ నిర్వహించి రికార్డు నెలకొల్పింది. ప్రపంచంలో ఒక్క ఏడాది వ్యవధిలో ఇలా కార్నియల్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీలు నిర్వహించడం ఇదే ప్రధమం. కాగా గతంలో కూడా ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ 23,901 కార్నియల్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకులు, చైర్మన్ గుల్లపల్లి ఎన్ రావు మాట్లాడుతూ 1986లో ఇక్కడ కార్నియల్ ట్రాన్స్‌ప్లాంట్స్ చికిత్సలు ప్రారంభించామని, ఇప్పుడు రికార్డు స్థాయిలో ఈ చికిత్సలు కొనసాగడం అభినందించదగిన విషయమన్నారు.
