అంతర్జాతీయ సదస్సుకు కేయూ ప్రొఫెసర్
కాకతీయ యూనివర్సిటీ జంతుశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ జీ షమిత మే 1వ తేదీ నుంచి అమెరికాలో జరుగనున్న అంతర్జాతీయ సదస్సులో పాల్గొననున్నారు. అమెరికాలో జరుగుతున్న ఏఏపీఎస్ నేషనల్ బయోటెక్నాలజీ కాన్ఫరెన్స్లో పరిశోధక పత్రం సమర్పించనున్నారు. తర్వాత కాలిఫోర్నియాలోని పలు యూనివర్సిటీలను ఆమె సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఆమెను అధ్యాపకులు, పరిశోధకులు అభినందించారు.
