నేషనల్ జియో సైన్స్ – 2016 అవార్డులు
తెలంగాణ రాష్ట్రంలోని నలుగురు శాస్త్రవేత్తలకు నేషనల్ జియో సైన్స్ -2016 అవార్డులను కేంద్ర గనులశాఖ ప్రకటించింది. డా.ఆనంద్‌కుమార్, మార్కండేయులు, రమేశ్‌బాబు, శైలేశ్లు అవార్డుకు ఎంపికయ్యారు. ఈనెల 12న రాష్ట్రపతి చేతుల మీదుగా శాస్త్రవేత్తలు ఈ పురస్కారాలు అందుకోనున్నారు. భూభౌతిక పరిశోధన విభాగంలో శాస్త్రవేత్తలు పురస్కారాలకు ఎంపికయ్యారు.
