యాదాద్రిలో దర్శనాలు బంద్…

తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రిలో భక్తులు దర్శనాలు నిలిపి వేస్తున్నట్లు ఆలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. 12వ తేదీ నుంచి ఈ నెల 21 వరకు యాదాద్రిలో భక్తులు అనుమతి లేదని తెలిపింది. రేపు ఉదయం 10 గంటల వరకే దర్శనాలకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశాయి. అలాగే స్వామివారి నిత్య కైంకర్యాలు అంతరంగికంగా యథావిధిగా కొనసాగనున్నాయి. రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.