Gen Z: కాలేజీలకు రాహుల్, కేంద్రంపై యుద్దభేరీ..?

కేంద్ర ప్రభుత్వంపై, కేంద్ర ఎన్నికల సంఘంపై పోరాటం చేస్తున్న కాంగ్రెస్ అగ్ర నేత, పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi). ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉద్యమానికి రంగం సిద్ధం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా.. ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకొని, ఓటు చోరీ జరిగిందంటూ ఆయన తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక గురువారం కూడా ఈ అంశానికి సంబంధించి ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేశారు. కర్ణాటకలో పెద్ద ఎత్తున కాంగ్రెస్(Congress) అనుకూల నియోజకవర్గాలతో పాటుగా, బూతులలో ఓట్లను తొలగించారని.. తెల్లవారుజామున 4 గంటల సమయంలో పెద్ద ఎత్తున ఓట్లు చోరీకి గురయ్యాయని ఆయన విమర్శించారు.
దీనిపై కర్ణాటక ప్రభుత్వం విచారణ జరపాలని భావించిన సరే, ఎన్నికల సంఘం ఏమాత్రం సహకరించలేదని, రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక గురువారం సాయంత్రం ఆయన చేసిన ఒక ట్వీట్ సంచలనమైంది. దేశవ్యాప్తంగా జెన్ జీ ఉద్యమానికి యువతతో కలిసి, తాను సిద్ధమవుతున్నానని ప్రకటించారు. యువతతో కలిసి కేంద్ర ఎన్నికల సంఘంపై, కేంద్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తానని హెచ్చరించారు. దీంతో రాహుల్ గాంధీ ఏ విధంగా పోరాటం చేస్తారనే దానిపై రాజకీయ వర్గాలతో పాటుగా, కేంద్ర ప్రభుత్వం వర్గాల్లో సైతం ఆసక్తి నెలకొంది.
రాహుల్ గాంధీ గతంలో జోడయాత్ర పేరుతో దేశవ్యాప్తంగా పర్యటించారు. కేరళ నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు పెద్ద ఎత్తున ఆయన పాదయాత్ర చేశారు. ఇప్పుడు అదే తరహాలో మరోసారి ఓటు చోరీ అంశం గురించి రాహుల్ గాంధీ పోరాడే అవకాశం ఉంది. కాలేజీలతో పాటుగా యువత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో, ఆయన ఈ నిరసన కార్యక్రమాలను తెలిపేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయంలో కేంద్రాన్ని, ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేసేందుకు రాష్ట్రాల వారీగా చోరీకి గురైన ఓట్లను.. ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రంలోనే ఆధారాలను చూపించాలని రాహుల్ భావిస్తున్నారు.
ఈ విషయంలో రాహుల్ గాంధీ పక్కా ప్లానింగ్ తో అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో అత్యంత సన్నిహితుల వద్దనే వీటి గురించి మాట్లాడుతున్నారని, వారితోనే, రాహుల్ గాంధీ సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా సమాచారం. ఈ విషయంలో మాజీ కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కూడా రాహుల్ గాంధీ కలుపుకునే ఆలోచనలో ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల అంటున్నాయి.