CBI: లిక్కర్ కేసు సిబిఐకే..? చంద్రబాబు సంచలన నిర్ణయం..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తున్న లిక్కర్ కుంభకోణానికి(Liquor Case) సంబంధించి, త్వరలో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ కేసులో కేంద్ర దర్యాప్తు బృందం ఈడి ఇటీవల విచారణ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. దీనితో అక్కడి నుంచి ఏ పరిణామాలు ఉంటాయా అంటూ.. రాజకీయ వర్గాలు ఆసక్తికరంగా గమనిస్తున్నాయి. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan)ని కూడా విచారించే అవకాశం ఉందనే క్లారిటీ, రెండు మూడు రోజుల క్రితం వచ్చింది.
వైఎస్ జగన్ సోదరుడు అనిల్ రెడ్డి కూడా ఇందులో భాగమని అధికారులు గుర్తించారు. ఇక జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉండే మరికొంతమందికి కూడా, నోటీసులు వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం సైతం జరుగుతోంది. ఇక ఈ కేసును మరో కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ, విచారించే అవకాశం ఉందని పోలీస్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం కేసును విచారిస్తోంది. విజయవాడ పోలీస్ కమిషనర్ ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు.
ఇప్పటికే పక్క ఆధారాలతో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సహా అత్యంత కీలక వ్యక్తులను అరెస్టు చేసిన సిట్ అధికారులు, త్వరలోనే మరి కొంతమందిని కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. విదేశాలలో ఉన్న వాళ్ళని రప్పించాలి అంటే, సిబిఐ ద్వారానే సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. దీనితో కేసును సిబిఐ కి అప్పగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భావిస్తున్నట్లు సమాచారం.
ఈ అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై ముఖ్యమంత్రి ప్రకటన చేసే అవకాశాలు కనబడుతున్నాయి. లిక్కర్ కుంభకోణానికి సంబంధించి అసెంబ్లీలో చర్చించిన తర్వాత, దీనిపై ముఖ్యమంత్రి ప్రకటన చేయవచ్చు అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇప్పటికే వైసీపీ అధిష్టానం సిబిఐ దెబ్బకు ఇబ్బంది పడుతోంది. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గత పదిహేనేళ్ళ నుంచి, సిబిఐ కేసులతో ఇబ్బంది పడుతూ వస్తున్నారు. ఇప్పుడు ఈ కేసులో కూడా సిబిఐ ఎంటర్ అయితే మాత్రం పరిస్థితి వైసీపీకి మరింత ఇబ్బందికరంగా మారవచ్చు. అటు మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసును కూడా సిబిఐ విచారిస్తున్న సంగతి తెలిసిందే.