TTA: టీటీఏ 10వ వార్షికోత్సవంలో ప్రత్యేక అవార్డులు.. నామినేషన్ల ఆహ్వానం!
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) 10వ వార్షికోత్సవ వేడుకలకు సిద్ధమవుతోంది. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో డిసెంబర్ 25న ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమం ఘనంగా ప్రారంభంకానుంది. ఈ ప్రత్యేక క్రమంలోనే టీటీఏ (TTA) అవార్డ్స్ కమిటీ ‘టీటీఏ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్’ కోసం నామినేషన్లను ఆహ్వానిస్తోంది. ప్రతిభ, సేవ, ఆవిష్కరణలను గుర్తించడమే ఈ అవార్డుల ముఖ్య ఉద్దేశమని టీటీఏ తెలిపింది.
టీటీఏ (TTA) కమ్యూనిటీ సర్వీస్ అవార్డు, విద్యలో విశిష్టత అవార్డు, గ్రీన్ విజనరీ అవార్డు, ఆరోగ్య & వైద్య విశిష్టత అవార్డు, స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డు, సాంస్కృతిక వారసత్వ అవార్డు, టెక్ ఇన్నోవేషన్ అవార్డు, సాహిత్య ప్రతిభ పురస్కారాలకు టీటీఏ నామినేషన్లు స్వీకరిస్తోంది.
వీటితోపాటు అద్భుతమైన సేవ చేసిన అందించిన వారికి అందించే ప్రత్యేక గుర్తింపు అవార్డు (Special Recognition Award) కోసం కూడా నామినేషన్లు కోరుతోంది. నామినేషన్ వివరాలను awards@telanganaus.org మెయిల్‌కు పంపాలని నిర్వాహకులు తెలిపారు. అలాగే టీటీఏ (TTA) 10వ వార్షికోత్సవాలకు అందరూ హాజరవ్వాలని కోరింది.







