Ramchandra Rao: ప్రజా సమస్యల పరిష్కారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ విఫలం : రాంచందర్రావు
తెలంగాణలో కాంగ్రెస్(Congress) , బీఆర్ఎస్ (BRS) రెండూ పాలించే అవకాశం పొందినా, ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమయ్యాయనని, ఇప్పుడు ప్రజలు బీజేపీకి ఒక అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు (Ramchandra Rao) కోరారు. జూబ్లీ హిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డ డివిజన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు పార్టీల పాలననూ ప్రజలు చూశారని, మార్పునకు సమయం వచ్చిందని, అది జూబ్లీ హిల్స్ నుంచి ప్రారంభం కావాలన్నారు. వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అప్పటి సీఎం చంద్రబాబు (Chandrababu) సహకారంతో హైదరాబాద్ అభివృద్ధికి పునాదులు వేసిందన్నారు. తరువాతి ప్రభుత్వాలు దాన్ని కొనసాగించినా, ప్రస్తుత ప్రభుత్వాలు ఆ క్రెడిట్ మొత్తం తమదేనని చెప్పుకోవడం తప్పని విమర్శించారు. ఎర్రగడ్డలో రెసిడెన్షియల్ కాలనీ మధ్యలో పైవ్రేటు శ్మశానం ఏర్పాటు చేయడం అవివేకమైన, అమానుష చర్య అని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇలాంటి పనులు చేయడం ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టడమే అవుతుందన్నారు.







