Nandamuri: సీనియర్ డైరెక్షన్ లో మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ ప్లానింగ్..?

నందమూరి నరసింహ బాలకృష్ణ(Nandamuri Balakrishna) కుమారుడు మోక్షజ్ఞ తేజ (Nandamuri Mokshagna), సినిమా ఎంట్రీ పై ఎప్పటినుంచో ప్రచారం జరుగుతున్న సరే, ఇప్పటివరకు అది ముందుకు అడుగు పడలేదు. గత ఏడాది అధికారిక ప్రకటన వచ్చిన సరే ఇప్పటివరకు సినిమా మాత్రం విడుదల కాలేదు. భారీ బడ్జెట్ తో ప్రశాంత్ వర్మ(Prashanth varma) డైరెక్షన్ లో మోక్షజ్ఞతేజ సినిమా ఎంట్రీ ఖరారు అయింది. దానికి సంబంధించి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. సినిమా షూటింగ్ కూడా కొన్ని రోజులు పాటు జరిగింది.
కానీ ఆ తర్వాత షూటింగ్ ఆగిపోయింది. దీని వెనుక కారణాలు ఏంటి అనేది తెలియకపోయినా, చిత్ర యూనిట్ గాని నందమూరి కుటుంబం గానీ దీనిపై ఎటువంటి రియాక్షన్.. సోషల్ మీడియాలో గాని ఎలక్ట్రానిక్ మీడియాలో గానీ బయట పెట్టలేదు. ఇక దీనితో మోక్షజ్ఞ తేజ సినిమాపై ఎన్నో ఊహగానాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఒక సీనియర్ డైరెక్టర్ మోక్షజ్ఞను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి.
నందమూరి బాలకృష్ణ తో గౌతమీపుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ సినిమాలు చేసిన సీనియర్ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్.. మోక్షజ్ఞను టాలీవుడ్ కు పరిచయం చేసే అవకాశాలు ఉన్నాయి. ఒక పౌరాణిక అంశంతో కూడిన కథను ఎప్పుడో సిద్ధం చేసి పెట్టుకున్న క్రిష్.. దానిని యువ హీరోతో తీయాలని ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ కథను బాలకృష్ణకు చెప్పగా బాలయ్యకు నచ్చడమే కాకుండా, ఆయన చిన్న కుమార్తె తేజస్విని కి కూడా విపరీతంగా నచ్చిందట. దీనితో నందమూరి బాలకృష్ణ ఈ సినిమాను నిర్మించేందుకు కూడా ముందుకు వచ్చారు.
సినిమా కథలో చిన్న చిన్న మార్పులు కూడా బాలయ్య చెప్పడంతో, ఏమాత్రం అభ్యంతరాలు చెప్పకుండా వాటిని మార్చారు. త్వరలోనే సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. దసరా తర్వాత దీనిని అధికారికంగా ప్రకటించే సంకేతాలు కనబడుతున్నాయి. మంచిరోజు చూసుకుని షూటింగ్ కూడా మొదలుపెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే లుక్ టెస్ట్ లను కూడా దాదాపుగా డైరెక్టర్ పూర్తి చేశాడు. ఈ సినిమాకు కొత్త హీరోయిన్ తో పాటుగా మరి కొంతమంది కొత్త నటులను పరిచయం చేసే అవకాశం ఉంది. దాదాపుగా భక్తి బ్యాగ్రౌండ్ లో ఈ సినిమా ఉండే అవకాశం ఉందని నందమూరి ఫ్యామిలీ వర్గాలు అంటున్నాయి.