Devagudi: ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి, మంత్రి మందిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి చేతుల మీదగా “దేవగుడి” ఫస్ట్ లుక్ లాంచ్

పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్ పై బెల్లం సుధా రెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణ రెడ్డి రచనా దర్శకత్వంలో స్వీయ నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం దేవగుడి (Devagudi). ఈ చిత్రానికి లక్ష్మీకాంత్ కనికే డిఓపిగా పనిచేయగా షేక్ మదీన్ సంగీతాన్ని అందించారు. నాగిరెడ్డి ఎడిటింగ్ చేశారు. అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ ప్రధాన పాత్రలు పోషించగా పలువురు నటీనటులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. కాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఆంధ్రప్రదేశ్ విప్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, మంత్రి మందిపల్లి రాంప్రసాద్ రెడ్డి చేతుల మీదగా మీడియా సమక్షంలో లాంచ్ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. మా చిత్ర ఫస్ట్ లుక్ లాంచ్ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులకు, అతిథులకు అందరికీ ధన్యవాదాలు. పిలిచిన వెంటనే ప్రజా సేవలో ఎంతో బిజీగా ఉండి కూడా ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారికి, మంత్రి మందిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా నాయకుల నిబద్ధతను ప్రేరణగా తీసుకొని ఎంతో జాగ్రత్తగా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. ప్రేక్షకులంతా మా చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
నటుడు అభినవ్ శౌర్య మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా వారికి, అలాగే మమ్మల్ని ఆశీర్వదించడానికి అతిథులుగా వచ్చిన గౌరవ శాసనసభ్యులకు నమస్కారం. ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి ఎదగాలని వచ్చిన నాకు అవకాశం ఇచ్చిన మా దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరూ మా సినిమాను సపోర్ట్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను” అన్నారు.
నటుడు నరసింహ మాట్లాడుతూ… “ఈ సినిమాను సపోర్ట్ చేస్తూ అతిథులుగా వచ్చిన విప్ ఆదినారాయణ రెడ్డి గారికి , మంత్రి మందిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి ధన్యవాదాలు. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం మా తండ్రి. ఆయనకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా సినిమా కోసం దర్శక నిర్మాత రామకృష్ణారెడ్డి గారు ఎంతగానో కష్టపడ్డారు. కేవలం ఆయన డెడికేషన్ వల్ల ఈరోజు సినిమా ఈ స్థాయిలో రావడం జరిగింది. అలాగే నాతోపాటు కలిసి నటించిన నటీనటులకు కృతజ్ఞతలు” అన్నారు.
నటి అనుశ్రీ మాట్లాడుతూ… “మా ఆహ్వానాన్ని మన్నించి నేడు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. నాకు సినిమాలో క్యారెక్టర్ ఇచ్చి అవకాశం ఇచ్చిన మా దర్శకునికి ప్రత్యేక ధన్యవాదాలు. మా చిత్రం కోసం పనిచేసిన సాంకేతిక నిపుణులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సినిమా కోసం అందరం ఎంతో కష్టపడ్డాము” అన్నారు.
నటుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ… “అందరికి నమస్కారం. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. నాకు సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాత రామకృష్ణ రెడ్డి గారికి ధన్యవాదాలు. నేను ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ ఈ సినిమాలో నా పాత్ర ప్రత్యేకం. మరొకసారి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను” అన్నారు.
సంగీత దర్శకుడు షేక్ మదీన్ మాట్లాడుతూ… “అందరికి నమస్కారం. నన్ను నమ్మి ఈ సినిమాకు సంగీతం చేసేందుకుగానూ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాత రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సినిమాలో బిజిఎం మరింత బాగా మాట్లాడుతుంది” అన్నారు.
డిఓపి లక్ష్మీకాంత్ మాట్లాడుతూ… “అందరికి నమస్కారం. దేవగుడి అనేది ఎంత పవర్ఫుల్ టైటిల్ గా ఉందో ఈ సినిమాలో ఎమోషన్ కూడా అంతే పవర్ఫుల్గా ఉంటుంది. ప్రస్తుత ఎన్నో హిట్ సినిమాల కోవలో మా సినిమా ఉండాలని కోరుకుంటున్నాను. ముందుగా మా చిత్ర బృందంలో అందరికంటే ఎంతో కష్టపడిన వ్యక్తి మా దర్శకులు. ఆయన అందరికంటే ఒక అడుగు ముందు ఉండి ఆలోచిస్తూ సినిమాను మరింత ముందుకు తీసుకుని వెళ్లారు. అలాగే మా సినిమాలో నటీనటులు కూడా ఎంతో అద్భుతంగా నటించారు. సాంకేతిక నిపుణులు ఎంతో కష్టపడి తమ అవుట్ పుట్ ఇచ్చారు. నాకు ఈ సినిమాలో పనిచేసేందుకు అవకాశం ఇచ్చిన మా దర్శకనిర్మాత రామకృష్ణారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను” అన్నారు.
మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆది నారాయణరెడ్డి గారికి, అలాగే సోదర సమానులు ఈ చిత్ర దర్శకనిర్మాత రామకృష్ణారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా ద్వారా చిత్ర బృందం అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మా కడప మాండలికంలో ఈ సినిమా ఉండటం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ చిత్ర నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఆల్ ద బెస్ట్ తెలుపుతున్నాను” అన్నారు.
విప్ ఆది నారాయణరెడ్డి మాట్లాడుతూ… “అందరికి నమస్కారం. వ్యక్తిగతంగా ఈ చిత్ర దర్శకనిర్మాత రామకృష్ణారెడ్డి గారు నాకు ఎంతో పరిచయం ఉన్న వ్యక్తి. మా ఊరు పేరుతో ఈ సినిమా టైటిల్ పెట్టి ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడం నాకు ఎంతో సంతోషంగా అనిపించింది. ఈ సినిమాకు ఎన్నో బాధ్యతలు వహించి ప్రేక్షకులకు తీసుకొస్తున్న రామకృష్ణారెడ్డి గారికి ఈ సినిమా ద్వారా మంచి విజయ సాధించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సినిమాలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ప్రేక్షకులకు మంచి సందేశాన్ని ఇచ్చే విధంగా సినిమాలు ఉండాలని కోరుకుంటున్నాను” అంటూ ఈ చిత్ర టైటిల్ ప్రత్యేకతను వివరిస్తూ ముగించారు.