Teja Sajja: తేజ నెక్ట్స్ సినిమాల అప్డేట్స్

చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ను మొదలుపెట్టిన తేజ సజ్జా(Teja Sajja) ఆ తర్వాత హీరోగా మారి పలు సినిమాలు చేసిన విషయం తెలిసిందే. తేజ హీరోగా ఎక్కువ సినిమాలు చేసింది లేకపోయినా, అతని స్క్రిప్ట్ సెలెక్షన్ వల్ల వరుస విజయాలను అందుకుంటున్నాడు. ఆల్రెడీ హను మాన్(Hanu Man) తో పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అందుకున్న తేజ, రీసెంట్ గా మిరాయ్(mirai) తో మరో హిట్ ను అందుకున్నాడు.
మిరాయ్ సినిమాతో సక్సెస్ ను అందుకున్న తేజ, ప్రస్తుతం ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే మిరాయ్ ను మరింత ప్రమోట్ చేస్తున్నాడు. సక్సెస్ సెలబ్రేషన్స్ లో మునిగి తేలుతున్న తేజ తన తర్వాతి సినిమాల అప్డేట్ గురించి రీసెంట్ గా ఓ సందర్భంగా క్లారిటీ ఇచ్చాడు. తాను తర్వాతి సినిమాగా జాంబిరెడ్డి(Zombie Reddy) సీక్వెల్ జాంబిరెడ్డి2(Zombie Reddy2) చేయనున్నానని, ఆ సినిమాలో కామెడీతో పాటూ యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయని చెప్పాడు.
2027లో జాంబిరెడ్డి రిలీజ్ కానుందని చెప్పిన తేజా, జై హనుమాన్(Jai hanuman) ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఉందని, ప్రశాంత్ వర్మ(Prasanth Varma), రిషబ్(Rishab)ఫ్రీ అవగానే ఈ సినిమా మొదలవుతుందని చెప్పాడు. ఇక మిరాయ్ సీక్వెల్ గురించి చెప్తూ మిరాయ్ సీక్వెల్ లో ఆడియన్స్ ను ఆశ్చర్యపరిచే ఐడియాలు చాలా ఉంటాయని చెప్పాడు. మొత్తానికి వరుస సినిమాలతో తేజ లైనప్ మాత్రం చాలా సాలిడ్ గా ఉంది.