Ghaati: ఘాటీ వల్ల తరలివస్తున్న టూరిస్టులు

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka Shetty) ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) దర్శకత్వంలో తెరకెక్కిన ఘాటీ(Ghaati) సినిమా ఈ నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఘాటీ సినిమా ఫ్లాప్ అవడం అనుష్క ఫ్యాన్స్ కు నిరాశను మిగిల్చింది. అయితే ఘాటీ ఫ్లాపైనప్పటికీ ఓ విధంగా మాత్రం ఇప్పుడా సినిమా పాపులరవుతోంది.
ఘాటీ కథ ఆంధ్ర- ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో జరగ్గా సినిమాను సెట్స్ లో కాకుండా నేచురల్ లొకేషన్లలో తెరకెక్కించారు. ఈ సినిమాలో లొకేషన్లు చూసిన ఆడియన్స్ ఇప్పుడా ప్రదేశాలను ఎక్స్‌ప్లోర్ చేయడానికి క్యూ కడుతున్నారు. సినిమాలో దుడుమా రిజర్వాయర్, దుడుమా వాటర్‌ఫాల్స్ ఆన్ స్క్రీన్ పై చాలా అద్భుతంగా చూపించారు.
వాటితో పాటూ బలాడా కేవ్స్, మాచ్‌ఖండ్ పవర్ ప్లాంట్, వించ్ హౌస్, ఆ కొండలు మరింత ఎట్రాక్టివ్ గా కనిపించగా, ఇప్పుడు ఆ లొకేషన్లను వెతుక్కుంటూ టూరిస్టులు అక్కడికి క్యూ కడుతున్నారు. మొన్నటివరకు చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన ఈ లొకేషన్లన్నీ ఘాటీ సినిమాతో కొత్త గుర్తింపును తెచ్చుకున్నాయి. అక్కడ రష్ పెరగడంతో ఎప్పుడూ లేనిది టీ షాప్స్, టూరిస్ట్ గైడ్స్ కూడా పుట్టుకొచ్చారు.