Team India: ప్రాక్టీస్ కు సీనియర్ లు.. వీడియోలు వైరల్

టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ(Rohith Sharma) ఓపెనర్ కేఎల్ రాహుల్(KL Rahul) వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దశాబ్దాలుగా భారత క్రికెట్ ను శాసిస్తూ వస్తున్న ఈ ఆటగాళ్లు, జిమ్ వీడియోలు రిలీజ్ చేశారు. తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలు.. ఇండియన్ క్రికెట్ టీం తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది. వీటికి మంచి స్పందన వస్తోంది. త్వరలో వెస్టిండీస్ పర్యటన ఉన్న నేపథ్యంలో కేఎల్ రాహుల్ తన ప్రాక్టీస్ తో పాటుగా జిమ్ ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేశాడు.
దీనికి సంబంధించి ఓ బాలీవుడ్ సాంగ్ తో తన వీడియోను ఎడిట్ చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు రాహుల్. ఆ తర్వాత దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇదే టైంలో వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ కూడా.. తన వీడియోను రిలీజ్ చేశాడు. ఆస్ట్రేలియా పర్యటన ఉన్న నేపథ్యంలో రోహిత్, ఆ పర్యటన కోసం సిద్ధమవుతున్నాడు. అటు విరాట్ కోహ్లీ(Virat Kohli) కూడా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. దీనికి సంబంధించిన ఒకటి రెండు ఫోటోలు ఇటీవల బయటకు వచ్చాయి. ఒక అభిమానితో దిగిన ఫోటో రిలీజ్ కావడంతో.. సోషల్ మీడియాలో ఫాన్స్ పండగ చేసుకున్నారు.
ఆ ఫోటోలో కోహ్లీ బ్యాట్ పట్టుకుని ప్రాక్టీస్ కు వెళుతున్నట్లుగా ఉంది. ఇక రోహిత్ శర్మ కూడా ఇటీవల ప్రాక్టీస్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఫిట్నెస్ విషయంలో రోహిత్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మరికొంతకాలం క్రికెట్ ఆడాలని భావిస్తున్నాడు రోహిత్ శర్మ. దీనితో ఫిట్నెస్.. విషయంలో జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఇటీవల బోర్డు నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షల్లో కూడా, రోహిత్ పాస్ అయ్యాడు. బరువు కూడా భారీగా తగ్గాడు. ఇక మిగిలిన సీనియర్ ఆటగాళ్లు కూడా ఆస్ట్రేలియా పర్యటనకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే జట్టు ఎంపిక కూడా ఉండే అవకాశం ఉంది. వెస్టిండీస్ పర్యటన తర్వాత సీనియర్ ఆటగాళ్లు నేరుగా ఆస్ట్రేలియా వెళ్ళనున్నారు. ఇక టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ మాత్రం ఇంకా ప్రాక్టీస్ మొదలుపెట్టలేదు. ప్రస్తుతం గాయం నుంచి కోలుకునే పనిలో ఉన్నాడు.