తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా అదనపు బాధ్యతల్లో నియమితులైన సీపీ రాధాకృష్ణన్ పదవీ స్వీకార ప్రమాణం చేశారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాధే నూతన గవర్నర్‌తో ప్రమాణం చేయించారు. బుధవారం రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా సాగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. నూతన గవర్నర్‌కు ఆయన శుభాభినందనలు తెలియజేశారు.