Revanth Reddy: “టూరిజం కాన్క్లేవ్-2025” కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణ (Telangana) ఏర్పడి పదేళ్లయినా టూరిజంకు ఒక పాలసీ లేదు. మా ప్రభుత్వం ఏర్పడిన తరువాత టూరిజంకు ప్రత్యేక పాలసీ తీసుకువచ్చాం. పర్యాటక రంగంలో రూ.15 వేల కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చిన శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు గారిని అభినందిస్తున్నా. తెలంగాణలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. హైదరాబాద్ ఓల్డ్ సిటీ కాదు.. ఇది ఒరిజినల్ సిటీ. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతాం. ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీపడుతుంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి… లాభాలు పొందండి. ఇండియా పాకిస్థాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా హైదరాబాద్ లో ప్రపంచ సుందరీమణుల పోటీలు నిర్వహించాం. శాంతిభద్రతల విషయంలో తెలంగాణ సెఫెస్ట్ ప్లేస్. మీ పెట్టుబడులకు ఇక్కడ రక్షణ ఉంటుంది..