సోనియా గాంధీతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటించారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో రేవంత్ భేటీ అయ్యారు. రేవంత్ వెంట రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జ్ దీపా మున్షి కూడా ఉన్నారు. తెలంగాణలోని రాజకీయ పరిణామాలపై సోనియాకు రేవంత్ వివరించినట్లు తెలుస్తోంది. లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపైనా చర్చించినట్లు సమాచారం. ఎన్నికల వ్యూహాలు, పార్టీ ప్రచార సభలపై చర్చించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సోనియా, రాహుల్, ప్రియాంక ప్రచార సభలపై చర్చించిన రేవంత్, తెలంగాణలో వందరోజుల పాలనపై అధిష్ఠానికి వివరించినట్లు తెలుస్తోంది. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన వారికి టికెట్లు ఖరారు అంశంపై చర్చించినట్లు వినికిడి. ఇక రేపు కాంగ్రెస్ జాబితా రానుండటంతో రేవంత్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడిరది.