Revanth Reddy: తెలంగాణ రైజింగ్ కోర్ అర్బన్ అభివృద్ధిపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్

తెలంగాణ (Telangana) రైజింగ్ కోర్ అర్బన్ ఏరియా అభివృద్ధిపై పలు ప్రతిపాదనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చిన అధికారులు. ఐదు ప్రధాన అంశాల ప్రాతిపదికన అభివృద్ధి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సీఎంకు వివరించిన అధికారులు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేసిన సీఎం. వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక వెండింగ్ జోన్స్ ను ఏర్పాటు చేయాలని సూచించిన సీఎం. మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్, ఫైర్ సేఫ్టీ అంశాలపై పలు సూచనలు చేసిన ముఖ్యమంత్రి. వీధి దీపాలకు సోలార్ విద్యుత్ వినియోగం, కొత్తగా పునరుద్ధరిస్తున్న చెరువుల వద్ద పైలట్ ప్రాజెక్టుగా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు అంశాన్ని పటిశీలించాలన్న సీఎం. కోర్ అర్బన్ రీజియన్ లో వీధుల ఆధునీకరణ, సుందరీకరణ చేపట్టాలన్న సీఎం. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించిన ముఖ్యమంత్రి. విద్యుత్ సబ్ స్టేషన్ల అప్ గ్రేడేషన్ తో పాటు, విచ్చలవిడిగా ఉన్న ట్రాన్స్ ఫార్మర్లను స్ట్రీమ్ లైన్ చేసి రీ-లొకేట్ చేయాలన్న సీఎం. మంచినీటి, మురుగునీటి వ్యవస్థపై నిర్వహణ వేర్వేరుగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం. అనుమతుల విషయంలో వివిధ విభాగాల మధ్య సమన్వయం ఉండేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించిన సీఎం.