Breakfast: తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త

తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది. భాగ్యనగరంలో రూ.5 బ్రేక్ ఫాస్ట్ (Breakfast) పథకం ప్రారంభించనున్నారు. మోతీనగర్(Moti Nagar) , మింట్ కాంపౌండ్ (Mint Compound) వద్ద ఉన్న ఇందిరమ్మ క్యాంటీన్‌లో బ్రేక్ ఫాస్ట్‌ను ప్రారంభించనున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మి. మొదటి దశలో 60 ప్రాంతాల్లో ఇందిరమ్మ క్యాంటీన్లలో బ్రేక్ ఫాస్ట్ పథకం అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత నగర వ్యాప్తంగా 150 ఇందిరమ్మ క్యాంటీన్లలో బ్రేక్ ఫాస్ట్ అందించనుంది జీహెచ్ఎంసీ. రోజుకు 25 వేల మందికి మిల్లెట్ టిఫిన్స్ అందించనుంది. మెనూలో ఇడ్లీ, ఉప్మా, మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ ఉప్మా, పూరీలు, పొంగల్ అందించనుంది. ఒక్కో ప్లేట్‌కు రూ. 19లు ఖర్చు అవుతుండగా. రూ. 14లు భరించనుంది జీహెచ్ఎంసీ. ఈ క్యాంటీన్లు వారానికి ఆరు రోజులు కొనసాగగా, ఆదివారం మాత్రం సెలవు ఉంటుంది.