ముస్లింల రిజర్వేషన్లపై పునరాలోచించాలి కిషన్ రెడ్డి
ముస్లింలకు రిజర్వేషన్లు పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై తెరాస ప్రభుత్వం పునరాలోచించాలని భాజపా శాసనసభపక్షనేత జి.కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. తెరాస పుట్టకముందే మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా భాజపా నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తారా? మీ తాటాకు చప్పుళ్లకు నరేంద్రమోడీ సర్కారు బెదరదు. దేశసమగ్రతకు భంగం కలిగే వ్యాఖ్యలు చేస్తారా అంటూ కేసీఆర్పై కిషన్రెడ్డి ధ్వజమెత్తారు.
