ఈనెల 23న తెలంగాణలో అమిత్‌షా పర్యటన
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 23వ తేదీన ఆయన తెలంగాణలో పర్యటించనున్నారు. ఢిల్లీలో అమిత్‌షాతో తెలంగాణ నేతలు భేటీ అయ్యారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు తదితరులు అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రైతు సమస్యలు, పార్టీ బలోపేతం, అమిత్‌షా టూర్‌పై చర్చ జరిగింది. అనంతరం ఈ నెల 23వ తేదీన అమిత్‌షా తెలంగాణ పర్యటనను ఖరారు చేశారు.
