కేసీఆర్కు భారతరత్న ఇవ్వాలి
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మడమతిప్పని పోరాటం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు భారతరత్న ఇవ్వాలని కేసీఆర్ భారత్రత్న బనావో అభియాన్ సంస్థ వ్యవస్థాపక కన్వీనర్ తాహెర్ కమాల్ ఖుంద్మిరి, కో- ఆర్డినేటర్ కన్వీనర్ మీర్ ఇనాయత్ అలీబాఖ్రీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఎంతో మంది ఉద్యమకారుల ఆత్మార్పణలతో కేసీఆర్ నేతృత్వంలో ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందని గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి సహా యావన్మంది నాయకులు సాధించలేని తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కలను కేసీఆర్ నిజం చేశారని, ఈ నేపథ్యంలో ఆయనకు భారతరత్న ఇవ్వడం సముచితం అని అభిప్రాయపడ్డారు. కేసీఆర్కు భారతరత్న ఇవ్వాలని కోరుతూ వచ్చే వారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించి అక్టోబరులో ప్రధానికి వినతిపత్రం అందజేస్తామని అన్నారు.
