నో ప్రాఫిట్.. నో లాస్‌తో నడిచే ట్రస్ట్,,,
బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన భవనాల ప్రారంభం సందర్భంగా చైర్మన్ బాలకృష్ణ మాట్లాడుతూ.. ప్రాంతాలు వేరైనా మన భాష ఒక్కటేనన్నారు. అమ్మ కోరిక మేరకు ఈ ఆసుపత్రిని నాన్న నిర్మించారని బాలకృష్ణ చెప్పారు. ఇది నో ప్రాఫిట్.. నో లాస్‌తో నడిచే ట్రస్ట్ హాస్పిటల్ అని బాలకృష్ణ తెలిపారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ఆసుపత్రిని నిర్వహిస్తామని బాలకృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు నూతన భవనాలను ప్రారంభించారు.
