100 రోజుల్లో 100 తప్పులు.. వైరల్ అవుతున్న కేటీఆర్ ట్వీట్..

తెలంగాణలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పై కేటీఆర్ నిప్పులు చెరుగుతున్నారు. ఈరోజుటికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఒకపక్క కాంగ్రెస్ పార్టీలో సంబరాలు అంబరాన్ని తాకుతుంటే.. కేటీఆర్ మాత్రం సోషల్ మీడియా వేదికగా వారిపై విరుచుకుపడుతున్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫుల్ జోష్లో పనులు చేయడమే కాక.. బీఆర్ ఎస్ పార్టీకి.. మరీ ముఖ్యంగా కేసీఆర్ కుటుంబానికి చుక్కలు చూపిస్తున్నారు. ఇలాంటి సమయంలో కేటీఆర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటై వంద రోజులు పూర్తయిన సందర్భంగా.. ఈ వంద రోజులలో 100 తప్పులు చేశారని.. పదేళ్ల తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చాక రైతులు అష్ట కష్టాలు పడుతున్నారని.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ నమ్మించి మోసం చేసిందని.. ఇది అభయం ఇచ్చే హస్తం కాదు అబద్దాల హస్తం అంటూ.. ఆన్లైన్ వేదికగా మండిపడ్డారు. ఇక అలాగే కాంగ్రెస్ చేసిన 100 తప్పులను ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో 100 కోషన్స్ ని కూడా పెట్టారు. ప్రస్తుతం కేటీఆర్ పెట్టిన ఈ ట్వీట్ హార్డ్ డిస్కషన్ గా మారింది. ఇక దీనికి రేవంత్ రెడ్డి స్టైల్ ఆఫ్ రిప్లై కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.