Srisailam: శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ

కర్నూలు పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) శ్రీశైలం (Srisailam) క్షేత్రాన్ని దర్శించుకున్నారు. అర్చకులు, ఆలయ అధికారులు ఆయనకు లాంఛనంగా స్వాగతం పలికారు. భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వారికీ మోదీ పూజలు చేశారు. మల్లికార్జునస్వామికి పంచామృతాలలో రుద్రాభిషేకం, భ్రమరాంబదేవికి ఖడ్గమాల, కుంకుమార్చన పూజలు చేశారు. పూజల అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించున్నారు. ఇక్కడి శివాజీ దర్బార్ హాల్, ధాన్య మందిరాలను తిలకించారు. మోదీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) శ్రీశైలం చేరుకున్నారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.